వైద్యులపై దాడులపై సుప్రీంకోర్టు సీరియస్

08-09-2026 | 11:22am

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 7: మహారాష్ట్ర(Maharashtra)లో వైద్యులు, ఆస్పత్రి సిబ్బందిపై రాజకీయ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులను తేలికగా తీసుకోలేమని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని స్పష్టం చేసింది. థాణేలోని డోంబివ్లి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి కేసులో అరెస్టైన శివసేన కార్పొరేటర్ రమేశ్ సుక్రియ మాత్రే బెయిల్ షరతులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

వైద్యులపై దాడుల ఘటనలు పెరుగుతున్నాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పాల్ఘర్‌లో ఆస్పత్రి సిబ్బందిపై ఇటీవల జరిగిన దాడి ఘటనను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లేలా నిందితులపై చర్యలు ఉండాలని పేర్కొంది. కాగా, తన అప్పీల్‌ను ఉపసంహరించుకుంటామని మాత్రే తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తలు