కండక్టర్‌గా సీఎం విజయ్
- తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం
- ‘వెట్రి పయనం’ పథకానికి ప్రతీయేటా 6వేల కోట్ల ఖర్చు
చెన్నై, అక్టోబర్ 2: తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్(Tamil Nadu CM C. Joseph Vijay) బస్సు కండక్టర్(Bus conductor) అవతారమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు టికెట్లను(Free bus tickets) అందించారు. తమిళనాడు ఎన్నికల్లో(Tamil Nadu Election) ప్రకటించిన మహిళలకు ఫ్రీబస్సు పథకం-2 ‘వెట్రి పయనం’ను శుక్రవారం సీఎం విజయ్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ‘మగలిర్ విడియల్ పయనం(Magalir Vidiyal Journey)’ పథకాన్ని గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా మరి ంత విస్తరించారు. కోయంబేడు బస్ టెర్మినల్‌లో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు, యువతులు సీఎం విజయ్‌కు చాక్లెట్లు ఇచ్చి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణించొచ్చు. 84.32 లక్షల మంది మహిళల కు ఈ పథకం ద్వారా ప్రతిరోజూ లబ్ధి చేకూరనుంది.
విస్తరించిన పథకం కింద నగరాలు, పట్టణాల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్ బస్ సర్వీస్, మఫిసల్ ప్రాంతాల్లో ఆర్డినరీ సర్వీసుల్లో మహిళలకు ఈ పథకం వర్తించనుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవా ణా సంస్థలు నిర్వహిస్తున్న 18,413 బస్సులలో 12,695 (69 శాతం) బస్సులు ఈ పరిధిలోకి వచ్చాయి. పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రతీయేటా రూ. 6వేల కోట్ల ఖర్చు చేయనుంది.