నేపాల్ వరదల్లో అద్భుతం
నేపాల్ మహా విషాదం
నేపాల్-టిబెట్ ఆకస్మిక వరదలు
తొమ్మిది రోజుల తర్వాత సొరంగంలో కార్మికులు సజీవం
ఖాట్మండు: నేపాల్(Nepal) మహా విషాదంలో(Nepal-Tibet flash flood) ఊహించని అద్భుతం జరిగింది. వరదల అనంతరం 10 రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు. బురదలో చిక్కుకున్న ఇద్దరిని రెస్క్యూ బృందాలు(Rescue teams) రక్షించాయి. త్రిశూలీ-3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టు(Trishuli-3 Hydropower Project) వద్ద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. సొరంగం పూర్తిగా మూసుకుపోవడంతో కార్మికులు, ఇంజినీర్లు చిక్కుకున్నారు. ఆగస్టు 26న టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో(Tibet-Nepal border) వరదలు సంభవించాయి. ఇప్పటివరకు నేపాల్ వరదల్లో(Nepal floods) మృతుల సంఖ్య 1,259 దాటింది. నేపాల్-టిబెట్ వరదల్లో దాదాపు 5 వేల మంది గల్లంతయ్యారు. థర్మల్ డ్రోన్లు, భారీ యంత్రాలతో రెస్క్యూ ఆపరేషన్(Rescue operation) కొనసాగుతోంది.






