రెజ్లింగ్ ప్రపంచంలో విషాదం.. బ్రాన్సన్ రీడ్ కన్నుమూత
ప్రముఖ రెజ్లింగ్ సంస్థ WWEలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ (Star Bronson Reed) 38 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(World Wrestling Entertainment) అధికారికంగా వెల్లడించింది.
ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన క్రౌన్ జువెల్ 2026(Crown Jewel 2026) ఈవెంట్లో బ్రాన్సన్ రీడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఫైట్లో ఆయన తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అనంతరం వైద్య చికిత్స పొందిన ఆయన నవంబర్ 27న వైద్యపరమైన సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
బ్రాన్సన్ మృతి పట్ల WWE తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనను గొప్ప ప్రదర్శనకారుడిగా మాత్రమే కాకుండా, మంచి మనసున్న వ్యక్తిగా, కుటుంబానికి అంకితమైన వ్యక్తిగా సంస్థ కొనియాడింది. ఆయన భార్య, కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. బ్రాన్సన్ రీడ్ మృతితో రెజ్లింగ్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. 38 ఏళ్లకే ఆయన కన్నుమూయడం క్రీడా ప్రపంచాన్ని కలచివేసింది.