మృతుడి కుటుంబానికి టీఆర్‌ఎస్‌ తరఫున ఎక్స్‌గ్రేషియా

28-11-2026 | 02:47pm

ఉట్నూర్, నవంబర్ 28 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పేందూర్ భూమేష్ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా (Ex-gratia) అందించారు. అక్టోబర్ 30న టీఆర్‌ఎస్‌ అధినేత్రి కల్వకుంట్ల కవిత నిర్వహించిన బహిరంగ సభకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంద్రవెల్లి నుంచి డోంగర్గాం గ్రామానికి ఆటోలో ప్రయాణిస్తున్న భూమేష్ హర్కాపూర్ తండా వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందారు.

ఈ ఘటనపై స్పందించిన కవిత మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్థిక (Financial) సాయం ప్రకటించారు. ఆమె ప్రకటించిన సాయాన్ని ఖానాపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి మెస్రం దయాకర్ పటేల్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి నగదు (Cash) రూపంలో అందజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో ముత్తునూరు సర్పంచ్ రీటే విటల్, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు గెడం భరత్, రాథోడ్ ప్రశాంత్, కేస్లాపూర్ దేవారి మెస్రం జంగు బాబు, ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన కమిటీ రగల్ జెండా చైర్మన్ మెస్రం నాగనాథ్, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క చిత్రు, ఉట్నూర్ మండల నాయకులు జగన్, కుమ్ర రాము, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు