క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే
చిట్‌చాట్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : క్యాబినెట్ విస్తరణ(Cabinet expansion,) ఇప్పట్లో లేదని, ఢిల్లీ పర్యటన(Delhi visit)లోనూ దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్(Mahesh Kumar Goud) వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైకమాండ్(High Command) నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపట్టాలనేది సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయమని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) చిట్‌చాట్ నిర్వహించారు.
తనకు మంత్రి పదవి రావడంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి అంశంపై తనకు అధికారిక సమాచారం లేదన్నారు. కొండా సురేఖను కాపాడేందుకు చూశామని, ఆమె విషయంలో అందరం ప్రయత్నం చేసినట్టు వివరించారు.
కొండా సురేఖ బర్తరఫ్ పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమని, ఆ విషయంలో హైకమాండ్ ఒప్పుకోలేదని తెలిపారు. అధిష్ఠానంతో జరిగిన చర్చల్లో ప్రధానంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపైనే చర్చ జరిగినట్లు తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్‌రెడ్డి నెరవేర్చారని అన్నారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశామని స్పష్టం చేశారు. రాబోయే వంద రోజులు దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తామన్నారు.






