ఇద్దరు టీనేజర్ల ఫుడ్ వెంచర్

22-09-2026 | 05:30am

చిన్న వయసులోనే పెద్ద ఆలోచన

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): 18 ఏళ్ల సత్య ధీర్ బిసమ్(Satya Dheer Bisam), 17 ఏళ్ల సూర్య కార్తిక్ పులిగిల్ల(Surya Karthik Puligilla) కలిసి అకాయ్ స్టేషన్స్(Akai Stations) పేరుతో కొత్త ఫుడ్ వెంచర్‌(Food Venture)ను ప్రారంభించారు. బ్రెజిల్‌లోని బెలెం, పారాలో లభించే వైల్ హార్వెస్టెడ్ ప్రామాణిక అకాయ్‌ను భారత ఫుడ్ సర్వీస్ రంగా(Indian food service sector)నికి అందించడమే సంస్థ లక్ష్యం. బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన ప్రత్యేక టేస్టింగ్ కార్యక్రమంలో అకాయ్ స్టేషన్న్ అధికారికంగా ప్రారంభించారు.

కార్యక్రమానికి చీకోటి ప్రవీణ్, డాక్టర్ ఉషా యనమంద్ర, డాక్టర్ పూర్ణిమ, డాక్టర్ ఎస్. చిన్నారెడ్డితో పాటు ఫుడ్, బెవరేజ్, లైఫ్‌స్టుల్, మీడియా రంగాల ప్రముఖులు హాజర య్యారు. కేఫ్లు, జ్యూస్ బార్లు, జెలాటేరియా లు, హోటళ్లు, డెజర్ట్ ఔట్లెట్ల కోసం మిషన్-రెడీ లిక్విడ్ అకాయ్, రెడీ-టు-గో అకాయ్ సా ర్బెట్ వంటి ఉత్పత్తులను సంస్థ అందిస్తోం ది. ప్రస్తుతం సుమారు 35 బీటూబీ కస్టమర్లకు సేవలు అందిస్తున్న అకాయ్ స్టేషన్స్.. వచ్చే 24 నెలల్లో 200 బీటూబీ ఖాతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

మరిన్ని వార్తలు