ఇచ్చోడ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ అజీమ్
నియామక పత్రం అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ జాదవ్
పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: అబ్దుల్ అజీమ్
ఇచ్చోడ (విజయక్రాంతి ): ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీరిచేల్మ ఉప సర్పంచ్ అబ్దుల్ అజీమ్(Abdul Azeem) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ జాదవ్ చేతుల మీదుగా అబ్దుల్ అజీమ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీమ్ మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు
ఇచ్చోడ మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తల సహకారంతో కృషి చేస్తానని అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతుగా నిరంతరం కృషి చేస్తానన్నారు.
జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు
తనపై నమ్మకం ఉంచి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ జాదవ్‌కు అబ్దుల్ అజీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.