అభి పాఠశాల యాజమాన్యం దురుసు ప్రవర్తన

22-09-2026 | 05:57pm
  1. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా...
  2. తరగతి గదులను సీజ్ చేసిన రెవెన్యూ అధికారి...

బాన్సువాడ, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురులాబాద్ మండల కేంద్రంలో ఉన్న అభి ఇంటర్నేషనల్ ప్రవేట్ పాఠశాల లో(Abhi International Private School) అనుమతులు లేకుండా 9 10 వ తరగతులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో మంగళవారం బిఆర్ఎస్ వి విద్యార్థి సంఘం, పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ ను అడగగా విద్యార్థుల తల్లిదండ్రుల పై దురుసుగా ప్రవర్తించడంతో వెంటనే పాఠశాలలో కొనసాగుతున్న తరగతులను రద్దు చేయాలని పాఠశాల ముందు ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు సాయిబాబా మాట్లాడుతూ పర్మిషన్ లేకున్నా తరగతులు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, డీఈవో, ఎంఈఓ ఆదేశాలు పక్కన పెట్టి చట్టానికి విరుద్దంగా తరగతులు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఎంఈఓ చందర్ తో కలిసి పాఠశాలలో తర్వాత గదులను పరిశీలించగా తొమ్మిది పది తరగతులు అనుమతులు లేకుండా కొనసాగడంతో వెంటనే రెవెన్యూ అధికారి పాఠశాలకు చేరుకొని తరగతి గదులను సీజ్ చేసినట్లు తెలిపారు.

అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు.మైలారం మాజీ సర్పంచ్ మహేందర్. నచుపల్లి ఉప సర్పంచ్ శంకర్. దొంతి భాస్కర్.పిట్ల కుమార్. భూమయ్య. వడ్ల భాస్కర్. లక్ష్మణ్.నాగరాజు. గంగారాం. కనుక్కుట్ల శ్రీనివాస్ తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు