అభిషేక్ శర్మ విధ్వంసం

17-09-2026 | 08:26pm

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) వేదికగా జరుగుతున్న భారత్, ఆఫ్ఘనిస్థాన్ మూడవ టీ20 మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) అంతర్జాతీయ టీ20లో రికార్డు సాధించాడు. అఫ్ఘాన్ పై కేవలం 30 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 11 సిక్స్ లు, 9 ఫోర్లతో అఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో టెస్టు హోదా ఉన్న దేశంపై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా తన పేరును నమోదు చేసుకున్నాడు. 33 బంతుల్లో సెంచరీ చేసిన న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.

మరిన్ని వార్తలు