24 August, 2026 | 3:32 AM

టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం

24-08-2026 01:19 AM
  1. నలుగురు విద్యార్థులకు గాయాలు 
  2. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘటన 
  3. కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్‌పై కేసు

మేడ్చల్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కన్నడ నటుడు యష్ నటించిన టాక్సిక్ సిని మా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం జరిగింది. సౌండ్ బాక్స్ సిస్టమ్ కూలిపోవడంతో విద్యార్థితో సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరికి కాలు విరిగింది. మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి అని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి మేడ్చల్‌లోని మైసమ్మగూడలో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. వేదికపై నుంచి హీరో యష్ భారీ గా తరలొచ్చిన అభిమానులను ఉద్దేశించి ప్ర సంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చే సుకుంది. అక్కడికి వచ్చిన యువకుల బృందం ఒకటి సౌండ్ బాక్స్ సిస్టమ్ స్టాండ్‌పైకి ఎక్కగా, అది ఒక్కసారిగా కూలిపోయి ంది.

కూలిపో వడాన్ని గమనించిన నటుడు, ప్రేక్షకులను పరామర్శించడానికి తన ప్రసంగాన్ని కాసేపు ఆపారు. ‘అక్కడ అంతా బా గుందా? దయచేసి చూడండి... జాగ్రత్తగా ఉండండి. మీరు సురక్షితంగా ఉన్నారా?‘ అని యష్ అడిగారు. అనంతరం, మరో ఎత్తున నిర్మాణంపైకి ఎక్కినట్లు కనిపించిన మరో బృందాన్ని కిందకు దిగాలని కోరిన తర్వాత ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఈ ఘటనలో నలుగురు కింద పడి గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ‘ఒక విద్యార్థికి కాలు విరిగింది. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిరక్షంగా వ్యవహరించి నందున పేట్ బషీరాబాద్ పోలీసులు కాలేజీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. 

విద్యాలయంలో సినిమా ఈవెంటా?

విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే విద్యాలయంలో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సహజం. కానీ మల్లారెడ్డి తన కాలేజీలో ఏకంగా సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతి కూడా తీసుకోలేదు. నటుడు యష్ ప్రసంగిస్తుండగానే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యంపై మండిపడుతున్నారు.