రోడ్డుకే పట్టా ఇచ్చిన ప్రబుద్ధులు
- 102 గజాల కార్పొరేషన్ సీసీ రోడ్డు ఆక్రమణ
- నిర్మాణం తొలగించి రోడ్డును పునరుద్ధరించాలి
- అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త
- కలెక్టర్ ఫిర్యాదు నెంబర్ BR005/E/2026/000002
కొత్తగూడెం,విజయ క్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్(Kothagudem Corporation) 27వ డివిజన్ పరిధిలోని ప్రకాష్‌నగర్ మదీనా మసీదు ఏరియాలోని కార్పొరేషన్ సీసీ రోడ్డును ఆక్రమించి,ఆ రోడ్డుకు 76 జీవో కింద పట్టా ఇచ్చారని కొత్తగూడెం మండల రెవెన్యూ(Kothagudem Mandal Revenue) అధికారులపై ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారని, సదరు ఇంటిని 2011లో డాక్యుమెంట్ నెంబర్ 960/2011 ద్వారా 497 గజాల విస్తీర్ణంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
ఆ రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఇంటికి ఉత్తరం వైపున కార్పొరేషన్ సీసీ రోడ్డు ఉన్నట్లు నమోదైందని, ఆ రోడ్డులో కొంత భాగాన్ని ఆక్రమించి, 76 జీవో కింద పట్టా కోసం దరఖాస్తు చేసి 102 గజాలకు పట్టా పొందినట్లు ఆరోపించారు. అనంతరం ఆ పట్టా ఆధారంగా కొత్తగూడెం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 4010/2022 గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మిగిలిన సీసీ రోడ్డును కూడా ఆక్రమించే ప్రయత్నంలో భాగంగా కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు తెలిపారు.
రోడ్డును ఆక్రమించి 76 జీవో కింద పట్టా పొందిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆక్రమిత స్థలం మున్సిపల్ రోడ్డుగా నిర్ధారణ అయితే పట్టాను రద్దు చేసి, రోడ్డుపై నిర్మించిన కాంపౌండ్ వాల్ నిర్మాణాలను తొలగించాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ స్థలాన్ని తప్పుదోవ పట్టించి పట్టా పొందినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ఆక్రమణకు సంబంధించి ఫోటోలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఈసీ తదితర ఆధారాలను కలెక్టర్‌కు సమర్పించినట్లు
ఈసీ లో బయటపడ్డ నిజం-రోడ్డుకే పట్టా....
1. డాక్యుమెంట్ నెం. 950/2011 (497 గజాలు):
దీని సరిహద్దులు - ఉత్తరం: మున్సిపల్ రోడ్డు, దక్షిణం: మున్సిపల్ రోడ్డు, తూర్పు: ఎల్లయ్య మేస్త్రీ ఇల్లు, పడమర: మున్సిపల్ రోడ్డు. అంటే 2011 వరకు ఆ స్థలం చుట్టూ మున్సిపల్ రోడ్డు ఉందని రిజిస్ట్రేషన్ లోనే ఉంది.
2. డాక్యుమెంట్ నెం. 4010/2022 (102 గజాలు):
ఇదే రోడ్డును ఆక్రమించి 76 జీవో కింద తీసుకున్న పట్టా. దీని సరిహద్దులు - ఉత్తరం: రోడ్డు, దక్షిణం: రోడ్డు, తూర్పు: రాయమల్లు, పడమర: రోడ్డు. అంటే రోడ్డు మీదనే పట్టా ఇచ్చారు.
3. డాక్యుమెంట్ నెం. 2345/2010 (497 గజాలు):
దీనిలో కూడా సరిహద్దులు - ఉత్తరం: EXISTING WIDE ROAD, దక్షిణం: EXISTING WIDE ROAD. 2010 నుండే అది విశాలమైన రోడ్డు అని ప్రూఫ్ ఉంది.
తేలిన విషయం ఏంటే:
2010, 2011 డాక్యుమెంట్ల ప్రకారం అది కార్పొరేషన్ సీసీ రోడ్డు. ఆ రోడ్డునే 2022 లో 76 జీవో కింద 102 గజాలకు పట్టాగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం.
మొదటి దశ ఆక్రమణ:
రోడ్డులో మొదటి సగ భాగాన్ని ఆక్రమించి ఇనుప గేటు పెట్టి, తప్పుడు సమాచారంతో జీవో 76 కింద 102 గజాలకు పట్టా (డాక్యుమెంట్ నెం. 4010/2022) పొందారు. 2011 నాటి డాక్యుమెంట్ నెం. 960/2011 లో ఈ స్థలం సరిహద్దు మున్సిపల్ రోడ్డు అని స్పష్టంగా ఉంది. ఈసీ లో కూడా మున్సిపల్ రోడ్డు అనే ఉంది.
రెండవ దశ ఆక్రమణ:
మొదటి ఆక్రమణను ఎవరూ అడ్డుకోకపోవడంతో మిగిలిన సీసీ రోడ్డును కూడా ఆక్రమించి ప్రీకాస్ట్ వాల్ పెట్టి పూర్తిగా మూసివేసారు. ఇప్పుడు ప్రజలకు నడవడానికి దారి లేకుండా పోయింది.
కావున తహసీల్దార్ క్షేత్ర పరిశీలన లేకుండా ఇచ్చిన 102 గజాల పట్టాను రద్దు చేసి, గేటు మరియు ప్రీకాస్ట్ వాల్ ను తొలగించి సీసీ రోడ్డును పునరుద్ధరించాలని కోరుతున్నాము.