గాంధీజీ సేవలు చిరస్మరణీయం
- గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి ఆదర్శం : అదనపు ఎస్పీ నరేష్ కుమార్
- గాంధీజీ చిత్రపటానికి అదనపు ఎస్పీ ఘన నివాళులు
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 02 ( విజయక్రాంతి ) : మహాత్మా గాంధీజీ సేవలు చిరస్మరణీయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్(Additional SP Naresh Kumar ) అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సహనం, ఐక్యత వంటి గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రత్నం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.