మరో 9 లక్షల ఇళ్లను కేటాయించండి
- మొదటి విడతలో 2 లక్షల ఇళ్లను కేటాయించారు
- కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం(Pradhan Mantri Awas Yojana Scheme)లో భాగంగా రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో వినతిపత్రం అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వ్యవసాయ రంగం(Agricultural Sector)లో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు కలిశారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని, ఎల్ నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని సీఎం వివరించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబి య్యాన్ని అందిస్తున్నామని, సన్న వడ్లకు క్విం టాకు రూ.500 బోనస్ అందించి రైతులను ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పం డ్లు, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.