4 September, 2026 | 10:41 PM

Breaking News

శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •  

నీటి గుంటలో పడిపోయిన ఆటో...

14-11-2024 | 01:45pm

మహిళా మృతి ముగ్గురికి గాయాలు.. 

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆటో అదుపుతప్పి నీటి గుంటలో పడి ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురికి గాయాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. రూరల్ మండలంలోని బంగారి గూడ డంపింగ్ యార్డ్ సమీపంలో ఆటో ముందరి టైరు పంచర్ కావడంతో రోడ్డు ప్రక్కనే ఉన్న నీటి గుంటలో పడిపోయింది. ఈ ఘటనలో వ్యవసాయ కూలీ మోరే సవిత (35) తో పాటు మరో ముగ్గురు సైతం నీటి గుంటల పడడంతో ముగ్గురు క్షేమంగా బయటపడ్డప్పటికీ, సవిత మాత్రం గల్లంతయ్యింది. కొద్దిసేపటికి ఈతగాళ్ల సహకారంతో  మృతదేహాన్ని వెలికి తీశారు. కాగా రూరల్ ఎస్ఐ ఘటన స్థలాన్ని చేరుకొని విచారణ చేపడుతున్నారు.