19 August, 2026 | 3:40 PM

బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్

19-08-2026 02:37 PM

బాల్య వివాహం – బతుకు ఆగం

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి, బాలల హక్కులను కాపాడేందుకు గ్రామస్థులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు  మర్రిపల్లి చందన అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి బాలికకు విద్య, రక్షణ, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గ్రామస్థులు, నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారుల ఉన్నారు. బాల్య వివాహాలు జరగని గ్రామంగా అంకుసాపూర్ నిలవడం స్ఫూర్తిదాయకమని తెలిపారు.