గచ్చిబౌలిలో లెదర్ ఫెసిలిటీ సెంటర్

25-10-2026 | 05:25am
  1. డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు మార్గనిర్దేశం
  2. రుక్మాపూర్‌లో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలు 
  3. టీజీఎల్‌ఐపీసీ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) పేర్కొ న్నారు. ఇందులో భాగంగా ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తద్వారా సుమారు వేయి మందికి ఉపాధి లభించే అవకాశం ఉం టుందని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోష న్ కార్పొరేషన్(టీజీఎల్‌ఐపీసీ) ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో లెదర్ ఇండస్ట్రీ అభివృద్ధి, ఆర్టిజన్లకు ప్రోత్సా హం అందించే చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఎస్సీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొ న్నారు. అంతర్జాతీయ హంగులతో గచ్చిబౌలిలో హబ్ అండ్ స్పోక్ విధానంలో మూడు న్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న సీఎఫ్‌సీ ద్వారా ఆర్టిజన్ల ఉత్పత్తులకు అదనపు విలువ(వాల్యూ యాడెడ్)ను జోడిస్తామన్నా రు.

డిజైనింగ్ మొదలు బ్రాండింగ్ వరకు వారి కి మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట, ఆర్మూర్‌లో మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్లస్టర్ డెవలెప్‌మెం ట్ ప్రోగ్రాం (ఎంఎస్‌ఈసీడీపీ) కింద ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను అం దుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.

గతంలో లిడ్ క్యాప్‌కు కే టాయించిన భూములు, ప్రస్తుతం వాటి స్థా యిపై వివరాలను అందించాలని అధికారుల ను ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమల శా ఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, డైరెక్టర్ నిఖి ల్ చక్రవర్తి, టీజీఎల్‌ఐపీసీ వీసీ అండ్ ఎండీ ప్రశాంత్ కుమార్, లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రెసిడెంట్ డా. ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

లీగల్ సెల్ అండగా నిలవాలి

33 జిల్లాల్లో పార్టీ న్యాయవాదులు క్రియాశీలకంగా ఉంటూ, ఫీజులు భరించలేని పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. భవిష్యత్తులో వారికి తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని హామీ ఇచ్చారు. శనివారం ఇందిరాభవన్‌లో టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ అధ్యక్షతన లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మధు యాష్కీగౌడ్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషిం చారని గుర్తు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులందరికీ ఇందిరమ్మ ప్రమాద బీమా అమలు చేస్తామని, హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. న్యాయవాదుల భద్రత కోసం ‘అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్’ తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపిందన్నా రు.

జీపీ, ఏజీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండిం గ్ కౌన్సిల్ పోస్టుల భర్తీపై సీఎం కసరత్తు చేస్తున్నారని తెలిపారు. నవంబర్ 1న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోరారు. 

మరిన్ని వార్తలు