కొడవలితో గొంతు కోసుకున్న వ్యక్తి
108 వాహనంలో ఆసుపత్రికి తరలింపు
కన్నాయిగూడెం, అక్టోబర్ 25(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని చింతగూడెం గ్రామంలో వ్యక్తి గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రోజున జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే చింతగూడెం గ్రామానికి చెందిన గాధం చంద్రశేఖర్ (37)కొడవలితో గొంతు కోసుకున్నాడు. ఆదివారం ఉదయం గొంతుకోసుకోగా గమనించిన స్థానికులు 108 సిబ్బంది సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఈఎంటీ కళ్యాణ్, పైలట్ రవిందర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.పరిస్థితి విషమించడంతో ములుగు ప్రభుత్వ దావఖానకి తరలించినట్టు సమాచారం.చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రశేఖర్ తన భార్యను అనారోగ్యం కారణంగా పుట్టింటికి పంపించాడని గ్రామస్తులు, స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు వ్యక్తిగత కారణాలా లేక కుటుంబ సమస్యలా అనేది తెలియాల్సి ఉంది.