బోధన్ సహకార సంఘం పగ్గాలు కోట పోతిరెడ్డికి

25-10-2026 | 09:15am

సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తా

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు

బోధన్, అక్టోబర్ 25,(విజయక్రాంతి): బోధన్ సహకార సంఘం చైర్మన్‌గా కోట పోతిరెడ్డి(Kota Pothireddy) ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవికి ఎన్నుకున్న సంఘం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తూ, సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని పేర్కొన్నారు. సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సభ్యుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ సంఘం కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తానని కోట పోతిరెడ్డి తెలిపారు.

తనపై నమ్మకంతో కీలక బాధ్యతను అప్పగించిన సభ్యుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, తన ఎన్నికకు సహకరించి ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని బాధ్యతగా భావిస్తూ, సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తానని కోట పోతిరెడ్డి వెల్లడించారు. చైర్మన్‌గా ఎన్నికైన కోట పోతిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు