అదిగో ఇదిగో?

25-10-2026 | 05:30am

నామినేటెడ్ పోస్టులపై పీసీసీ గడువులమీద గడువులు 

  1. దసరా దాటినా దక్కని పదవులు   
  2. దీపావళికి మరో ముహూర్తం   
  3. ఆశావహుల్లో అసంతృప్తి, అయోమయం
  4. గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు 
  5. ఎన్నికలకు రెండేళ్లే
  6. కాలయాపనతో అడుగంటుతున్న ఆశలు

హైదరాబాద్, అక్టోబర్ 2౪ (విజయక్రాం తి): అదిగో పదవులంటరు.. ఇదిగో గడువంటరు! కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల(Congress Nominated Posts) కో సం ఎదురుచూస్తున్న ఆశావహుల కు నిరీక్షణే మిగులుతోంది. దసరా నాటికి కార్పొరే షన్ పదవులన్నీ భర్తీ చేస్తామన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్..(PCC President Mahesh Kumar Goud) ఇప్పుడు దీపావ ళి గడువు తెరపైకి తెచ్చారు. పండుగలు మారుతున్నా పదవుల ముచ్చట తేలకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనం, అసంతృప్తి, అయోమయం నెలకొంది.

అసలు పదవుల పందేరం ఎప్పటికి కొలిక్కి వస్తుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. నామినేటెడ్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేసి ఉంటే పార్టీలోని ద్వితీయ నాయకత్వానికి పదవులు అనుభవించామనే సంతృప్తి ఉండేది. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చి మూడుళ్లు కావస్తున్నా పదవుల పందేరం చేపకట్టకపోవడం తో శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది.  నామినేటెడ్ పదవుల భర్తీలో సీఎం, పీసీసీ అధ్యక్షుడిదే కీలక నిర్ణయమన్నది బహిరంగ రహ స్యం.

ఈ విషయాన్ని  సొంత పార్టీ నేతలు సైతం ఒప్పుకుంటారు. ఇప్పటికే పలు దఫా లు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. దసరాకు నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామంటూ ప్రకటన చేశారు. పండుగ దాటిపోయిందే తప్ప.. ఒక్క పదవి కూడా భర్తీ చేయలేదు. తాజాగా సీఎంతో సమావేశం అనంతరం దీపావళి నాటికి భర్తీ చేస్తామంటూ మరోసారి పీసీసీ అధ్యక్షుడు ప్రకటించారు.

గడువులపై గడువులు విధిస్తుండం, తీరా పదవులు భర్తీ చేయకపోవడంతో ఆశావహుల్లో అసంతృప్తి, అయోమయం నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నా యి. పరిపాలనా పరంగా చూసుకుంటే ఒక సంవత్సరమే మాత్రమే. ఆపై ఏడాది ఎన్నికల ప్రక్రియకే సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే..నికరంగా ఒక సంవత్సరమే మిగిలింది. అయినా నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కాంగ్రెస్ అ ధిష్ఠానం చొరవ చూపడం లేదన్న విమర్శ లు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నా యి.   దసరా పాయే.. దీపావళి మిగిలింది!.. అటూచమత్కరిస్తున్నారు.

ఒక్కో నేత నుంచి నలుగురైదుగురికి సిఫారసు లేఖలు

కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల భర్తీపై అదిగో.. ఇదిగో అంటూ పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో హామీలు ఇస్తుండటంతో ఆశావహులు ఆష్టకష్టాలు పడి సిఫారసు లేఖలు సంపాదించుకుంటున్నారు. అయితే ఒక్కో నేత నల్గురైదుగురికి సిఫారసు లేఖలు ఇస్తుం డం కూడా ఆశావహులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇది ఎవరికి ఎసరు తెచ్చిపెడుతుందోనని వారు వాపోతున్నారు.

ఔత్సాహికుల్లో సీఎంతో సాన్నిహిత్యంగా ఉన్న నేతల్లో చాలా మంది ఇప్పటికే సిఫారసు లేఖలు సంపాదించినట్లు తెలుస్తోంది. మరికొందరు ముఖ్య నేతల లేఖలు సంపాదించారు. ఒకే పోస్టుకు నలుగురైదుగురు సిఫారసు లేఖలు సంపాదించడంతో గందరగోళం నెలకొంది. వీరిలో ఎవరిని పరిగణలోకి తీసుకుంటారు.. ఎవరికి పదివి దక్కుతుందనే అయోమయంలో ఆశావహులు ఉన్నారు.

నామినేటెడ్ పదవులను భర్తీ చేయకుండా ఇలాగే కాలయాపన చేసుకుంటూ పోతే పదవులు వచ్చిన సంతోషమే ఉండదన్న అభిప్రాయం ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. దీపావళికైనా పదవుల పందేరం పూర్తి చేయాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

నేతల చుట్టూ చక్కర్లు

కార్పొరేషన్లకు సంబంధించి చైర్మ న్లు, డైరెక్టర్లతో పాటు పలు నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆశావహులు గాంధీభవన్, ప్రధాన నేతల చుట్టూ తిరుగుతూ లాబీయింగ్ చేస్తున్నారు. అయినా పీసీసీ  మాట నిలబెట్టుకోకపోవడంతో ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. మరో వైపు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చూస్తే పదవులు దక్కవన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఆశావహుల పరిస్థితి కక్కలేక,మింగలేని చందంగా తయారైంది.

ఇలాగే ఆలస్యం చేస్తూ పోతే అంతిమంగా పార్టీకి నష్టం తప్పదని ఆశావహులు అంటున్నారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయి లో పార్టీ శ్రేణులను సరైన దిశగా నడిపించలేమనే అభిప్రాయం తమ సన్నిహితుల దగ్గర వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని వార్తలు