20 August, 2026 | 11:21 PM

మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం

20-08-2026 10:08 PM

టాప్-10లో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్

మనోహరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన “యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్” సందర్భంగా నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ స్టేషన్లు ఎస్హెచ్ ఓలలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ టాప్-10 లో ఎంపికైంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించేందుకు మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, సమర్థవంతమైన అవగాహన చర్యలను పరిగణన లోకి తీసుకుని ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఎస్సై బి. సుభాష్ గౌడ్ కు డీజీపీ. శ్రీ సందీప్ శాండిల్య, నార్కోటిక్స్ విభాగం ఇన్‌చార్జ్ అధికారులు ప్రశంసలు అందజేశారు. ఈ అవార్డు తన వ్యక్తిగత విజయం గా కాకుండా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ లోని ప్రతి ఒక్క సిబ్బంది సమష్టి కృషి, అంకితభావం, సహకారానికి లభించిన గుర్తింపు గా ఎస్సై సుభాష్ గౌడ్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, తల్లి దండ్రులు, విద్యాసంస్థలు, యువత పోలీసులతో కలిసి పనిచేసి “డ్రగ్ ఫ్రీ సొసైటీ” నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు.