ఎంఎస్ఎఫ్ శాతవాహన యూనివర్సిటీ నూతన కమిటీ నియామకం
కరీంనగర్ సిటీ (విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(Padma Shri Mandakrishna Madiga) ఆదేశాల మేరకు నూతన కమిటీల నిర్మాణం, అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగ విద్యార్థుల జాతీయస్థాయి ప్రతినిధుల సభను విజయవంతం చేయడంలో భాగంగా నేడు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ(Satavahana University)లో మాదిగ విద్యార్థుల సమావేశం ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చంచల నవీన్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్ఎఫ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జీ డాక్టర్ కొమ్ము శేఖర్ మాదిగ హాజరై మాట్లాడుతూ మహనీయులు కలలు కన్న సమసమాజం కోసం మాదిగ విద్యార్థులు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధపడాలనీ, ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ విద్యార్థులకు అందే విధంగా యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు అందరికీ అవగాహన కల్పించడమే కాకుండా సమ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో భవిష్యత్తులో తీసుకోబోయే కార్యక్రమాలకు శాతవాహన యూనివర్సిటీ మాదిగ విద్యార్థులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
అందులో భాగంగానే అక్టోబర్ 6న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ విద్యార్థుల జాతీయస్థాయి ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరై దిశానిర్దేశం చేస్తారని,మాదిగ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు.
అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఎంఎస్ఎఫ్ నూతన కమిటీనీ నియమించడం జరిగింది. అధ్యక్షులుగా చింతల అశోక్ మాదిగ అధికార ప్రతినిధిగా మారపల్లి రాజు మాదిగ ప్రధాన కార్యదర్శిగా తక్కెనపల్లి నరేష్ మాదిగ ఉపాధ్యక్షులుగా అందె రాజ్ కుమార్ మాదిగకార్యదర్శిగా కత్తెరపాక రాహుల్ మాదిగ సహాయ కార్యదర్శిగా సురేందర్ బాబు మాదిగ కార్యవర్గ సభ్యులుగా కనకం ప్రవీణ్ మాదిగ, దావా సుధీన, గోగర్ల కృష్ణవేణి, ఉప్పులేటి వైష్ణవి,మెరుగు పావని తదితరులను ఎన్నుకోవడం జరిగింది.