అనురాగ్ లో జనరేటివ్ ఏఐ, ఏజెంట్ డెవలప్‌మెంట్ పై వర్క్‌షాప్
ఘట్ కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ(Anurag University) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ చాప్టర్ల సహకారంతో టాస్క్ హైదరాబాద్ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ, ఏజెంట్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ ఏఐ విత్ గూగుల్ క్లౌడ్, యాంటిగ్రావిటీ అండ్ సర్వీస్‌నౌ అనే రెండు రోజుల వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రెండవ సంవత్సరం మొదటి సెమిస్టర్‌కు చెందిన ఐటీ, సీఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఏఐ, ఏఐ ఏజెంట్లు, ఏజెంట్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రైజ్ ఏఐ, గూగుల్ క్లౌడ్, యాంటిగ్రావిటీ, సర్వీస్‌నౌ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, వాటిని వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రాక్టికల్‌గా వివరించడం ఈవర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.