అర్బన్ బ్యాంక్ ఎజెండా ఆమోదం

27-09-2026 | 05:30pm

ముకరంపుర, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్(Karimnagar Cooperative Urban Bank) కరీంనగర్ సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు తలపెట్టడం జరిగింది. కానీ కోరం రానందున నిర్వహించలేకపోయినా అట్టి సమావేశం ఆరోజు ప్రకటించిన విధంగా దానికి అనుసంధానంగా ఆదివారం రెవిన్యూ గార్డెన్ కలెక్టరేట్ రోడ్ కరీంనగర్ నందు గడ్డం విలాస్ రెడ్డి పిఎసి చైర్మన్ అధ్యక్షతన సమావేశమై బ్యాంక్ నిర్వహణ నిమిత్తం ఎజెండా ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఎ సి చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు మడుపు మోహన్, ముక్క భాస్కర్, ముద్దసాని క్రాంతి మూల లక్ష్మి, ఈ లక్ష్మణ రాజు, ఏ విద్యాసాగర్ రేగొండ సందీప్ ఎండి షాముద్దీన్ మంగి రవీందర్ నాగుల సతీష్ మార్కారాజు మరియు బ్యాంక్ సీఈవో నునుగొండ శ్రీనివాస్ బ్యాంక్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు