ఆశా కార్యకర్తలకు.. ఉద్యోగ భద్రత కల్పించాలి

08-09-2026 | 02:16pm

తుంగతుర్తిలో ఆశా కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

తుంగతుర్తి (విజయ క్రాంతి): ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా కార్యకర్తల సంఘం మండల అధ్యక్షురాలు(Mandal President of the Activists Association) మేకల జయమ్మ అన్నారు. మంగళవారం తుంగతుర్తిలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఏఎంసీ టార్గెట్ ఎత్తివేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు