కొడవలితో దాడి

24-09-2026 | 05:02pm

మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మూడు నెలల క్రితం మహమ్మదాబాద్ మండల(Mohammadabad mandal) కేంద్రానికి చెందిన చింతకింది రమేష్ అనే వ్యక్తి, చెనేలి సుధాకర్‌కు చెందిన ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే రమేష్ మృతికి చెనేలి సుధాకర్ కారణమని భావించిన మృతుడి బంధువు చింతకింది శీను, సుధాకర్‌ను చంపుతానని గతంలో బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 22న రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో సుధాకర్ ఇంటి ముందు కేశవ్‌తో మాట్లాడుతుండగా, వెనుక నుంచి కొడవలి(machete)తో వచ్చిన శీను అకస్మాత్తుగా సుధాకర్‌పై దాడికి యత్నించినట్లు తెలిపారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సుధాకర్‌కు రక్తగాయాలయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహమ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు