డ్రైనేజీ సమస్యకు చెక్
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) ఐదో వార్డులో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్(Ward Councilor Nannepanga Srinivas), కోఆప్షన్ సభ్యుడు శ్రవణ్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి డ్రైనేజీలను శుభ్రం చేయించి సమస్యను పరిష్కరించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వార్డు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మురుగునీరు రోడ్లపైకి చేరడం లేదా ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.