ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
24-09-2026 | 01:03pm
బోథ్: రైతులంతా తప్పనిసరిగా రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాజిద్ కోరారు. మండలంలోని కౌటబి గ్రామంలో రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కలిగించారు. పండించిన పంటను విక్రయించేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవసరం ఉంటుందన్నారు. ఈ విషయంలో రైతులు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. కార్యక్రమంలో కౌట(బి)గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.