గ్రామ పరిశుభ్రతపై అవగాహన

10-09-2026 | 11:49pm

మొయినాబాద్‌,(విజయక్రాంతి): మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామం(Motkupalli village)లో సర్పంచి సంపూర్ణ రాములు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పారిశుద్ధ్య నిర్వహణ(Sanitation management)పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల నుంచి వెలువడే చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం, తడి–పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలపై చర్చించారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రజలు, గ్రామ పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు