సైబర్ మోసగాళ్ల కొత్త ప్లాన్‌

27-09-2026 | 10:02am

బ్యాంక్ పేరుతో మెసేజ్ వచ్చిందా? ఈ పని మాత్రం చేయొద్దు! 

బ్యాంక్ ఖాతాదారులకు కీలక అలర్ట్. రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకింగ్(banking fraud alert) సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ UFBU ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు సమాచారం. మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానుండటంతో, బ్యాంకుకు సంబంధించిన అత్యవసర పనులు ఉన్నవారు ఇవాళే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే డిజిటల్ బ్యాంకింగ్, UPI, ఏటీఎం వంటి కొన్ని సేవలు కొనసాగవచ్చు. బ్యాంకు శాఖల్లో జరిగే ప్రత్యక్ష సేవలపై మాత్రం సమ్మె ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. బ్యాంకులు బంద్ అవుతున్నాయనే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు(cyber fraud bank link) తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. “బ్యాంక్ సేవలు నిలిచిపోతాయి”, “ఖాతా యాక్టివేట్ చేసుకోండి”, “KYC పూర్తి చేయండి” అంటూ నకిలీ మెసేజ్‌లు లేదా లింకులు పంపే అవకాశం ఉందని సూచిస్తున్నారు. తెలియని లింకులపై(banking fraud alert) క్లిక్ చేయడం, OTPలు లేదా బ్యాంకింగ్ వివరాలు చెప్పడం చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంక్ పేరుతో వచ్చిన మెసేజ్ అయినా.. ముందుగా దాని నిజానిజాలను నిర్ధారించుకోవడం అత్యంత కీలకం.

బ్యాంక్ కస్టమర్లు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలియని SMS/WhatsApp లింకులపై క్లిక్ చేయొద్దు. బ్యాంక్ పేరుతో వచ్చినా ముందుగా నిర్ధారించుకోండి.

OTP, UPI PIN, ATM PIN, CVV, Net Banking Password ఎవరితోనూ చెప్పొద్దు. బ్యాంకు సిబ్బంది కూడా ఇవి అడగరు.

KYC Update, Account Block, Refund, Reward వంటి పేర్లతో వచ్చే మెసేజ్‌లను అనుమానించండి.

అనుమానాస్పద లింకుల ద్వారా బ్యాంకింగ్ యాప్ లేదా APK ఫైళ్లు ఇన్‌స్టాల్ చేయొద్దు.

డబ్బు రిసీవ్ చేయడానికి UPI PIN అవసరం లేదు. PIN అడిగితే అది మోసం కావచ్చు.

తెలియని వ్యక్తి చెప్పినట్లు AnyDesk, TeamViewer వంటి రిమోట్-యాక్సెస్ యాప్‌లు ఇన్‌స్టాల్ చేయొద్దు.

బ్యాంకు అధికారిక యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను మీరే తెరిచి సేవలను ఉపయోగించండి.

ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించండి.

మోసానికి గురైతే భారతదేశ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు వెంటనే ఫిర్యాదు చేయండి; National Cyber Crime Reporting Portalలో కూడా రిపోర్ట్ చేయవచ్చు.

మరిన్ని వార్తలు