100 బీసీ హాస్టళ్లకు సీఎం అంగీకారం

13-09-2026 | 05:05am
  1. దశలవారీగా ఫీజు బకాయిల చెల్లింపునకు హామీ
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి
  3. సీఎం రేవంత్‌రెడ్డితో బీసీ నాయకుల భేటీ

ముషీరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): బీసీల వివిధ సమస్యలపై బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య(BC leader R. Krishnaiah) నాయకత్వంలో శని వారం అసెంబ్లీ చాంబర్‌(Assembly Chamber)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి చర్చించారు. తెలంగాణలో బీసీ రక్షణ చట్టం(BC Protection Act) తీసుకురావాలని, 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 120 బీసీ గురుకులాలు మం జూరు చేయాలని కోరారు. వినతులపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ 100 బీసీ కాలేజీ హాస్టళ్ల మంజూరుకు అంగీకరించా రు. బీసీ రక్షణ చట్టానికి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని, ఇందుకోసం ఏపీలో రూపొందించిన చట్టం నమూనాను పరిశీలించాలని బీసీ సం క్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)ను ఆదే శించారు.

హాస్టళ్లకు సొంత భవనాల నిర్మా ణానికి అవసరమైన ఖాళీ స్థలాలను గుర్తిం చి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూ చిం చారు. పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను సాధ్యమైనంత త్వరగా దశలవారీగా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చా రు. ఈ సమావేశంలో బీసీ ఫ్రంట్ చైర్మన్ మ ల్లేష్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం వర్కిం గ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సం ఘం అధ్యక్షుడు సి రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్, రాములు యాదవ్, మణికంఠ, రా జు నేత, శివకుమార్ యాదవ్, నిఖిల్ పటేల్, నరేష్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, ప్రీతం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు