5 September, 2026 | 2:29 AM

సురేఖ బర్తరఫ్ ను నిరసిస్తూ కండ్లకు గంతలతో నిరసన

05-09-2026 | 12:21am

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి(National BC Rights Fighting Committee) ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)ని మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ఖండిస్తూ కండ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సామాజిక వర్గం రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు బీసీ బిడ్డ కొండ సురేఖపై తనకు సంబంధంలేని తన బిడ్డ వాక్యాల పట్ల తనపై చర్యలు తీసుకోవడం అమానుషం అన్నారు.

రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని, సామాజిక న్యాయం మాతోటే సాధ్యం అయితది అని చెప్పి బీసీలకు కాంగ్రెస్ లోనే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న పార్టీ మరి ఈరోజు బీసీ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కొండా సురేఖపై తీసుకున్న బర్తరఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో కొండ సురేఖకు బాసటగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించడానికి బీసీలుగా బీసీ సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, న్యాయవాది కర్రే లచ్చన్న, రాష్ట్ర నాయకులు గజ్జల్లి వెంకటయ్య, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాచర్ల  సదానందం, నాయకులు శాఖ పురి భీమ్సేన్, వేముల అశోక్, వేముల కిరణ్, చంద్రగిరి చంద్రమౌళి, ఎండి లతీఫ్, సురేంద్ర చారి, చెలిమెల అంజయ్య, గగ్గూరి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు