బెంగాల్ జుమ్లా!
దాదాపు మూడు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని మమతా బెనర్జీ(Mamata Banerjee) విడనాడారు. గడ్డిపూల గుర్తుతో సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress)ను ఏర్పాటుచేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నాయకురాలిగా(West Bengal leader) ఆమె ఎన్నో ఉద్ధాన పతనాలను చూశారు. ఎవరూ ఊహించని రీతిలో బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly election) భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఘన విజ యం సాధించింది. ఇన్నాళ్లు పులిలా గాండ్రించిన మమతకు గడ్డుకాలం ఎదురైంది. జరిగిన పరాభవం నుంచి కోలుకోకముందే మమత పార్టీలో ముసలం పుట్టింది.
ముప్పు ఏళ్ల క్రితం ఏ పార్టీని విడిచివచ్చారో ఆ పార్టీ తలుపులే ఆమె తట్టాల్సివచ్చింది. కాంగ్రెస్‌లో తృణమూల్‌ను విలీనం చేస్తారా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని బెంగాల్‌లో మమత తమ అస్థిత్వాన్ని నిలుపుకొంటారా అనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మమతకు దూరంగానే ఉంటూ వచ్చింది. ఇప్పటి సందర్భం పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలు. అందునా ఒకటి నందిగ్రామ్. ప్రస్తుత సీఎం, ఒకప్పటి మమత కుడిభుజం సువేందు అధికారి 2021లో ఈ స్థానం నుంచే మమతకు సవాల్ విసిరి గెలుపొందారు.
అప్పటి ఎన్నికల్లో మమత తిరిగి అధికారంలోకి రాగలిగినా.. అంతకుముందు, శక్తిమంతమైన వామపక్ష ప్రభుత్వాన్ని పడదోసి తన పాలనకు దారులు వేసిన నందిగ్రామ్ ఆమెకు ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌తోబాటు భవానీపూర్‌లోనూ గెలుపొందారు. భవానీ పూర్ నుంచి కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆయన నందిగ్రామ్‌ను వదులుకున్నారు. దీనితో నందిగ్రామ్, మరో నియోజకవర్గం రెజీనగర్‌కు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడే కథ మొదలైంది.
తృణమూల్ పార్టీ పేరు, చిహ్నంపై మమత వర్గానికి, చీలిక వర్గానికి మధ్య జగడం కొనసాగుతుండగా ఈసీ ఈ ఉప ఎన్నికల్లో రెండు వర్గాలకు రెండు వేర్వేరు గుర్తులు కేటాయించింది. దీనిపై మండిపడ్డ మమత.. బీజేపీని జుమ్లా పార్టీ అని దుమ్మెత్తిపోసింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా నందిగ్రామ్ నియోజకవర్గానికి మమత ప్రకటించిన అభ్యర్థి కాస్తా, సువేందుతో సమావేశమై, తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో నందిగ్రామ్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిస్తున్నట్లు మమత ప్రకటిం చారు. ఇక, ౨౦ఏళ్ల క్రితం జరిగిన అల్లర్ల కేసులో ఉన్నారని కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఓట్ చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు పార్టీలనే చోరీ చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్