ఐసీడీఎస్ సూప‌ర్ వైజ‌ర్ శైలజ‌కు ఉత్తమ పుర‌స్కారం

27-09-2026 | 09:34pm

మునిప‌ల్లి సెప్టెంబర్27 (విజయక్రాంతి)ః పోష‌ణ్ మాస ఉత్స‌వాల(Nutrition Month Celebrations) సంద‌ర్భంగా ఉత్త‌మ సేవ‌లు(Excellent Services) అందించిన  సంగారెడ్డి జిల్లామునిప‌ల్లి మండ‌ల ఐసీడీఎస్ సూప‌ర్ వైజ‌ర్ శైల‌కు ఉత్త‌మ అవార్డు ద‌క్కింది. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌తీక్ జైన్(District Collector Prateek Jain) చేతుల  మీదుగా అవార్డును అందుకున్నారు.  కాగా సూప‌ర్ వైజ‌ర్ గా బాధ్యత‌లుచేప‌ట్టిన నాటి నుంచి అంగ‌న్వాడీల‌కు అవ‌గాహ‌న క‌ల్పించడం, విధులను బాధ్య‌తగా చేప‌ట్టినందుకు అవార్డు ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా సూప‌ర్ వైజ‌ర్ శైలజ‌కు మండ‌లంలోని అంగ‌న్‌వాడీలు(Anganwadis), ప‌లువురు అభినందన‌లు తెలుపుతున్నారు.  అనంత‌రం అవార్డు రావ‌డంపై సూప‌ర్ శైలజ సంతోషం వ్య‌క్తం చేస్తూ క‌లెక్ట‌ర్ కు, ఐసీడీఎస్ అధికారుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

మరిన్ని వార్తలు