ఈశ్వరికి యువసేన యూత్ చేయూత
నంగునూరు, (విజయక్రాంతి): నంగునూరు మండలం(Nangunur Mandal) గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు(Gattlamalyala Zilla Parishad High School) చెందిన 10వ తరగతి విద్యార్థిని భానోతు ఈశ్వరి(Bhanoth Eswari), అంతర్జాతీయ అండర్-15 సాఫ్ట్‌బాల్ పోటీల్లో(Softball competition) భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. చైనా వేదికగా అక్టోబర్ 12 నుంచి 18 వరకు ఈ సాప్ట్ బాల్ పోటీలు జరగనున్నాయి.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా గ్రామ యువసేన యూత్ వెంటనే స్పందించి,విద్యార్థినికి అండగా నిలిచింది. వారి ఆధ్వర్యంలో ఈశ్వరి కి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అంతర్జాతీయ అండర్-15 బాలికల సాఫ్ట్‌బాల్ జట్టులో భానోతు ఈశ్వరి అద్భుతంగా రాణించి గ్రామానికి,పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని యూత్ అధ్యక్షులు కర్రె సంపత్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రంగు ప్రమోద్, సభ్యులు తిరుపతి, రాజు, శ్రీనివాస్, చింటు గౌడ్, అజయ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.