భవానిగూడలో రూ.5 లక్షల షెడ్డుకు భూమిపూజ
17-09-2026 | 12:48pm
బేల సెప్టెంబర్17(విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) ఆధ్వర్యంలో ITDA నుంచి రూ.5 లక్షల విలువైన షెడ్డుకు మంజూరు లభించింది. ఈ సందర్భంగా బేల మండలంలోని భవానిగూడ గ్రామంలో గురువారం షెడ్డుకు సర్పంచ్ ఘోడాo కిషోర్ భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ అభివృద్ధిలో భాగంగా షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.