ప్లాస్టిక్‌కు స్వస్తి.. లక్ష్మీపురంలో క్లాత్‌ బ్యాగుల వినియోగం

23-09-2026 | 08:22pm

బూర్గంపాడు, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గ్రామాన్ని ప్లాస్టిక్‌ రహితంగా, స్వచ్ఛ లక్ష్మీపురంగా తీర్చిదిద్దే లక్ష్యంతో క్లాత్‌ బ్యాగ్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) బుధవారం ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్‌ బాదం వెంకటేశ్వరరెడ్డి(Sarpanch Badam Venkateswara Reddy) రూపొందించిన బ్యాగ్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. క్లాత్‌ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ స్వచ్ఛత, పచ్చదనానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. లక్ష్మీపురాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యంతో కృషి చేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు