29 August, 2026 | 3:17 PM

మండల స్థాయి క్రీడల్లో భిక్కనూర్ విద్యార్థినుల ప్రతిభ

29-08-2026 02:14 PM

భిక్కనూర్, ఆగస్టు 29 (విజయ క్రాంతి): దోమకొండ మండలంలోని గడికోటలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో భిక్కనూర్‌కు చెందిన విద్యార్థినులు ప్రతిభ చాటారు. అండర్-16 విభాగంలో 100 మీటర్ల పరుగులో మనుశ్రీ రజత పతకం సాధించగా, అండర్-18 విభాగంలో 100 మీటర్ల పరుగులో శ్రీనిధి స్వర్ణ పతకం సాధించింది. ఈ విషయాన్ని పీడీ నర్సింహారెడ్డి, కోచ్ దేవుని భరత్ తెలిపారు. విజేతలను పలువురు అభినందించారు.