22 August, 2026 | 1:43 AM

పీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

22-08-2026 12:49 AM

వరంగల్, ఆగస్టు 21 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె నివాసంలో జరిగిన వేడుకల్లో హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ తినిపించి, శాలువా తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సోమ లక్ష్మి, సీనియర్ నాయకురాలు గిరిగిరి పుష్ప తదితరులు పాల్గొన్నారు.