నకిలీ పెన్షన్లపై సమగ్ర విచారణ జరపాలి
జిల్లా కలెక్టర్కు బీజేపీ వినతి
పాల్వంచ ,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలోని(Palvancha town) 27 డివిజన్లలో అర్హత లేని వ్యక్తులు దివ్యాంగుల పెన్షన్లు, వృద్ధాప్య చేయూత పెన్షన్లు(Cheyutha Pensions) పొందుతున్న విషయం పై సమగ్ర విచారణ(Comprehensive inquiry) జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) (బీజేపీ) నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు(Ponishetti Venkateswarlu) ఆధ్వర్యం లో శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పొనిశెట్టి మాట్లాడుతూ, పాల్వంచ పట్టణంలో దివ్యాంగుల పెన్షన్లు, వృద్ధాప్య చేయూత పెన్షన్ల మంజూరు, పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. శారీరక వైకల్యం లేని కొంతమంది వ్యక్తులు తప్పుడు ధ్రువీకరణ పత్రాల(Certification documents) ఆధారంగా దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్నారని, సదరం క్యాంప్(Sadaram Camp) లో వైద్య అధికారులు రూ 25,000 నుండి 30,000 వేల రూపాయలు తీసుకొని ఏ లోపం లేని వారికీ వికలాంగుల ధ్రువీకరణ పత్రాల జారీ చేస్తున్నారని ఆరోపించారు.
ఆలా చేసిన వైద్య అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని అన్నారు అదేవిధంగా, వృద్ధాప్య చేయూత పెన్షన్ల విషయంలోనూ అర్హతలను సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS), ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన కొంతమంది వ్యక్తులకు రూ 50,000 వేల నుండి లక్ష రూపాలు ప్రభుత్వ నుండి రిటైర్డ్ అయిన తరువాత ప్రభుత్వ పెన్షన్ వస్తున్న వృద్యాప్య పెన్షన్స్ తీసుకుంటున్నారని నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉందో లేదో పరిశీలించకుండా పెన్షన్లు పొందుతున్నారని అలాంటి వారి ని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు
ప్రస్తుతం దివ్యాంగుల పెన్షన్ కింద నెలకు రూ.3,016, వృద్ధాప్య చేయూత పెన్షన్ కింద నెలకు రూ.2,016 చొప్పున అందుతున్న నేపథ్యంలో, అర్హత లేని వ్యక్తులను గుర్తించకపోతే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని అన్నారు పాల్వంచ పట్టణంలోని మొత్తం 27 డివిజన్లలో పెన్షన్ లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, అనుమానాస్పద దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలను ప్రత్యేక వైద్య బృందాల ద్వారా పునఃపరిశీలించాలని కోరారు.
అర్హత లేని వ్యక్తులు పెన్షన్లు పొందుతున్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో తేలిన సంబంధిత అధికారులు, సిబ్బందిపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మాలోత్ ప్రశాంత్ నాయక్,కొత్తపల్లి విజయ,శాంపురి నాగేంద్ర బాబు,వాంకుడోత్ హాథిరామ్,సంకినేని రుద్ర,అజ్మీరా హాథిరామ్, కోరదల రమేష్,శాంపురి పవన్,పండు లు పాల్గొన్నారు