ప్రజాధనాన్ని వృధా చేస్తున్న అధికార, ప్రతిపక్ష నాయకులు

09-09-2026 | 05:36pm

బిజెపి మండల అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి

చేగుంట,(విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తూ, వీధి నాటకాలు ఆడుతున్నాయని మసాయిపేట్ బిజెపి అధ్యక్షులు ములుగు నాగేందర్ రెడ్డి(BJP Mandal President Mulugu Nagender Reddy) మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై  మూడు రోజులు అవుతున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు  తిట్టుకొనుడు తప్ప, ఏమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీల వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వారు కేవలం స్టంట్ లు చేసుకుంటున్నారని, తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అని, ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా శాసనసభలో  ఫీజు రీయంబర్స్మెంట్, 22ఏ, ఉద్యోగ సమస్యలు,యూరియా వంటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని అన్నారు ,

మరిన్ని వార్తలు