బీఆర్ఎస్ తో బీజేపీ చీకటి ఒప్పందం
ముకరంపుర, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతలు మరియు కేసీఆర్ కుటుంబ భూ దాహాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బయటపెడితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ దాన్ని వక్రీకరించి మాట్లాడంపై సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐ విచారణకు పంపిస్తే సంవత్సరం ఐనా విచారణ ఎందుకు జరుగుత లేదని ప్రశ్నించారు.
స్మార్ట్ సిటీ పనుల అవకతవకలపై ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఎంత మొత్తుకున్నా ఎంపీగా ఒక్కసారి కూడా బండి సంజయ్ స్పందించలేదు ఆనాటి నుండి బీఆర్ఎస్ తో ఉన్న ఒప్పందం వల్లనే కదా అని నరేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కరీంనగర్ నగర అభివృద్ధికి నిధులు మొత్తం మేమే తెచ్చామని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని అవహేళన చేశారు.గణేష్ నిమజ్జన ఏర్పాట్ల విషయంలో నిమజ్జనానికి నీటి విడుదల విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మాట్లాడారని తెలిపారు.ఈ విలేకరుల సమావేశంలో కార్పోరేటర్లు పర్వతం మల్లేశం,జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.