రక్తదానం సామాజిక బాధ్యతగా భావించాలి

24-09-2026 | 07:51pm

గజ్వేల్ , సెప్టెంబర్‌ 24: రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని ములుగు లోని అటవీ కళాశాల  డీన్‌ బి. ప్రవీణ(B. Praveena, Dean of the College of Forestry) అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ డే సందర్భంగా ఎఫ్‌సీఆర్‌ఐలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆమె మాట్లాడారు. యువత సేవాభావంతో ముందుకు రావాలని, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నాయన్నారు. శిబిరంలో 40 మంది వాలంటీర్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన నినాద రచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు