నిమజ్జనోత్సవాలకు అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు

24-09-2026 | 08:31pm

కాగజ్‌నగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీ(Kagaznagar municipality) పరిధిలో గణేష్ నిమజ్జనోత్సవాలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సబ్‌కలెక్టర్ హర్ష చౌదరి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి వంజరి గ్రామ సమీపంలోని పెద్దవాగు వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 25న నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు, సైడ్‌వాల్, రోపింగ్, పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరం, విద్యుత్, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

మరిన్ని వార్తలు