ఉత్తమ ఉపాధ్యాయుడిని సన్మానించి బ్లూ భీమ్ యూత్ సభ్యులు
10-09-2026 | 12:01am
తలమడుగు,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల దినోత్సవాన్ని(Teachers Day) పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న తలమడుగు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కొల్లూరి శంకర్‌ను బుధవారం బ్లూ భీమ్ యూత్ సభ్యులు(Blue bheem youth members) ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు(Students) అందిస్తున్న సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు శివ, సతీష్, వంశీ, సందీప్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.