లాభాల్లో 40 శాతం కార్మికులకు ఇవ్వాలి

27-09-2026 | 09:28pm

ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ(Singareni Company) వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 40 శాతం లాభాల వాటాను కార్మికులకు ఇవ్వాలని బీఎంఎస్ నాయకులు(BMS leaders) డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లందు ఏరియా జీఎంకు(Illandu Area GM) బీఎంఎస్ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షుడు నాయిని సైదులు(Naini Saidulu) మాట్లాడుతూ 12వ వేతన కమిటీ (JBCCI)ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.

గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు జరిగే వరకు JBCCIలోని అన్ని ట్రేడ్ యూనియన్లకు సంస్థ సమావేశాల్లో సమాన అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కోయగూడెం ఓసీ బీఎంఎస్ కార్యదర్శి బానోత్ బాలాజీ నాయక్, పిట్ సెక్రటరీ మూడు దశరథ్, పున్నం ప్రదీప్, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు