బొల్లారం ఆయుధాల చోరీలో పాక్ లింక్?
11-09-2026 | 05:46pm
హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ(Theft of Army weapons in Bollarum) ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మల్లేష్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఆయుధ డీలర్లతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మల్లేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాక్ ఆయుధ డీలర్‌ను ఫాలో చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆ డీలర్ ఖాతాలో షాట్‌గన్స్, ఏకే-47లకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయుధాల విక్రయ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.