7 September, 2026 | 6:08 AM

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్ ఆటో ర్యాలీ

07-09-2026 | 05:05am

మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 6(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసనలో భాగంగా బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మేడ్చల్ పట్టణంలో ఆటో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు సంబూరి ప్రభాకర్ (BRTU District President Samburi Prabhakar) మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ లకు 12000 వేల రూపాయలు ఇస్తామన్న హామీని ఇప్పటికీ మేలు చేయలేదని విమర్శించారు.

సంవత్సరానికి ఆటో డ్రైవర్ లకు 12 వేల రూపాయలు ఇస్తామన్న కాం గ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడుస్తున్న ఒక్క రూపాయి ఇవ్వలేదని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ ప్రభుత్వంపై మండిపడా ్డరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు 24 వేల రూపాయల బాకీపై మేడ్చల్ జిల్లా బి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ లకు మద్దతుగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు సంవత్సరానికి ఇస్తామన్న 12 వేల రూపాయలను వెంటనే అమలు చేయాలని లేనియెడల బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని భాస్కర్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజి కో ఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి, మాజి కౌన్సిలర్ తుడుం గణేష్, నాయకులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్, సందీప్ గౌడ్, రఘుపతి రెడ్డి,  శైలెందర్, చెరువుకొమ్ము నర్సింగరావు, రాజు, భాను, బి.ఆర్.టి.యు నాయకులు ఆటో డ్రైవర్ లు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు