గ్రాడ్యుయేట్లపై బీఆర్‌ఎస్ ఫోకస్

23-09-2026 | 05:35am
  1. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు 
  2. పార్టీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ 
  3. ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై దిశానిర్దేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై(Graduate MLC elections) బీఆర్‌ఎస్ ఫోకస్(BRS Focus) పెట్టింది. ఎన్నికల సన్నద్ధతపై పార్టీ నేతలతో కేటీఆర్, హరీశ్‌రావు(KTR, Harish Rao) తెలంగాణభవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు. హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు హాజరయ్యారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు(Voter Registration), చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల సన్నద్ధతపై నేతలకు కేటీఆర్, హరీశ్‌రావు(KTR, Harish Rao) దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టా త్మకంగా తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. పట్టభద్రుల ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఆ వ్యతి రేకతను తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు నేతలందరూ కృషి చేయాలని సూచించారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మె ల్సీ ఎన్ని కల్లో బీఆర్‌ఎస్ విజ యం సాధిస్తుందన్న విశ్వా సం వ్యక్తం చేశారు. విజయం కోసం ఇప్ప టి నుంచే పకడ్బందీగా పనిచేయాలని నిర్ణయించారు. ఎన్నికల సన్న ద్ధతలో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. త్వరలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మె ల్యేలతో సమావేశాలు నిర్వహించి మరింతగా చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు