విద్యతోనే మార్పు

23-09-2026 | 05:25am
  1. దళితులు, గిరిజనులకు సర్కార్ భరోసా
  2. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల్లో పెద్దపీట 
  3. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకు సత్వర న్యాయం 
  4. హైలెవెల్ కమిటీ సమీక్షలో సీఎం రేవంత్ స్పష్టీకరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : దళితులు(Dalits), గిరిజనులు(Tribals), ఆదివాసీల(Adivasis) అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి(Education, Employment, Skill Development) ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అరికట్టేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని అన్నారు.

విద్య తోనే సమాజంలో అసమానతలకు, అణిచివేత రుగ్మతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం స్పష్టం చేశారు. పిల్లలను చదువుతోపాటు క్రీడలవైపు ప్రోత్స హించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం(SC/ST (Prevention of Atrocities) Act)-1989 అమలుపై మంగళవారం సచివాలయంలో సీఎం అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఉన్నత నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, న్యాయస్థానాల్లో విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహా యం, పునరావాస చర్యలపై సీఎం సమీక్షించారు.

కేసుల విచారణ కోసం ఏర్పా టు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు(Courts of Law), మొబైల్ కోర్టుల పనితీరు, చట్టంపై అవగాహన కోసం చేపడుతున్న కార్యక్రమా లపై చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి సీఎం అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి విజిలె న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావే శం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి.

ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, బలరాంనాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేల్, మట్టా రాగమయి, వెడ్మ బొజ్జు, మురళీనాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ బాబు, ఎస్సీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రమంగా అయిదేండ్లలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు వివరించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, ప్రధానంగా 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నివేదించారు. అక్కడ పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరముందని తెలిపారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీల మీటింగ్‌లు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం కింద బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, సహాయం, పునరావాసం వెంటనే అందేలా చూడాలని అధికారులకు సూచించారు. బడ్జెట్ కేటాయింపులతో ముడిపెట్టకుండా గ్రీన్‌ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయాలన్నారు. ఇటీవల షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచార కేసులను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించి, బాధిత కుటుబాలకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. 

ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ సొంత బిడ్డల్లా ఆదరణ..

దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం, కార్యక్రమంలో వారికి తగినంత ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. దళితులు, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటినుంచో సొంత బిడ్డల్లా ఆదరించిందని, అందుకే పల్లెపల్లెనా ఇప్పటికీ ఇందిరమ్మను తలుచుకుంటున్నారని అన్నారు. పేదలకు 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు అందించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదని గుర్తుచేశారు.

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా దాదాపు 16 శాతం ఉంటే.. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో 31 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీలే ఉన్నారన్నారు. ఎస్టీల జనాభా 10 శాతం ఉంటే, వారికి 17 శాతం ఇండ్లను మంజూరు చేశామని వివరించారు.

రాష్ట్రంలోని 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల దళితులు, గిరిజనులు, ఆదివాసీలు సహా పేద కుటుంబాలకు నాణ్యమైన భోజనం అందుతోందన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 

మరిన్ని వార్తలు